Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు

Komatireddy Venkatreddy

Komatireddy Venkatreddy

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయన్నారు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించామన్నారు. మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించానని, పేద విద్యార్థులు నా దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు ఎంపీ కోమటిరెడ్డి. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు.

Also Read : Viral Video: వీడు మామూలోడు కాదురా సామీ… సింహాన్నే చెప్పుతో కొట్టిన వ్యక్తి!

గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటే చేయడం లేదని, మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు కోమటిరెడ్డి. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్న కోమటిరెడ్డి.. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ని గెలిపిస్తానన్నారు. 24 గంటల కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవి అబద్ధాలని, లాగ్ బుక్స్ తో అన్నీ బయటపెట్టానన్నారు. మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తామని, 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారు.. 50వేల కోట్లు తాగుడు మీదే వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయని, ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతాం.. తెలంగాణ అంతా కాంగ్రెస్ నేతలం పర్యటిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Also Read : Prabhas: అవి అయిపోగానే ప్రభాస్‌కి సర్జరీ… మళ్లీ ఏమైంది?

Exit mobile version