దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు ఛాయాలకు కేసీఆర్ కారణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాంతకుడికి, పనికిరాని వ్యక్తి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి ఏనాడు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పై రివ్యూ చేయలేదని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కు అయ్యారని ఆయన విమర్శలు గుప్పించారు. కేటాయింపులు లేకుండా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్ట్‌లను డిజైన్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన వారికి కాంట్రాక్ట్ లు ఇచ్చారు కేసీఆర్ అని ఆయన అన్నారు. నల్లగొండలో కేసీఆర్ మీటింగ్ పెడితే మా తడాఖా చూపిస్తామని, కేసీఆర్ నల్లగొండకు వస్తే జిల్లా ప్రజలు తరిమికొడతారన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు..
పొలిమేర నుండే కేసీఆర్ ను తరిమి కొడతామని, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. KRMB పై చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమా.. అసెంబ్లీ లో అన్ని చేర్చిస్తామని ఆయన అన్నారు. కేసుల నుండి తప్పించుకువడానికే బీజేపీ తో బీఆర్ఎస్, కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను బీఆర్‌ఎస్ కేసీఆర్ స్వీకరించాలని ఆయన కోరారు. మేడిగడ్డ నిర్మించిన హరీష్ రావు జైల్ కు కూడా వెళ్లొచ్చు అని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో డిపాజిట్ కూడా రాదని, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్ లలో జరిగిన అవినీతిలో కేసులు నమోదు అవుతాయని, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చరిత్ర కొన్ని రోజుల్లో బయటకు తీస్తామని ఆయన అన్నారు.
Nabha Natesh : జిమ్ లో చెమటలు చిందిస్తున్న కన్నడ బ్యూటీ..