Komatireddy Venkat Reddy : కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
- కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
- నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం
- పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ (కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కేంద్ర పథకాల అమలుకు సంబంధించి తన ఎంపీ అనుభవాలను సభ్యులతో పంచుకుంటూ, వాటిని ఎఫెక్టివ్‌గా అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతీ జిల్లాలో దిశ కమిటీలను ఏర్పాటు చేసి, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు అవసరమైన సమన్వయం అందిస్తోందని మంత్రి తెలిపారు. తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి నల్లగొండ జిల్లాలో అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, వేముల వీరేశం, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nitish Reddy: అదృష్టం అంటే నితీశ్ రెడ్డిదే.. 7 నెలల్లోనే ప్రతిష్ఠాత్మక ట్రోఫీలో ఛాన్స్!
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!