NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : రాహుల్‌.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అన్నారు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

కాంగ్రెస్ కు దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్ అన్నారని వెల్లడించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో టీ కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తారని, ఈ వారం ఎలక్షన్ కమిటీ, త్వరలోనే క్లారిటీ గా ఉన్న స్థానాల్లో టికెట్ల ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి తెలిపారు.

Also Read : బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి టాప్ గ్లామర్ షో

నాలుగు నెలలే గడువు ఉంది, యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాలన్నారన్నారని, రాజగోపాల్ గురించి నాకు తెలియదన్న వెంకట్ రెడ్డి.. నేను నా సోదరుని తో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటున్నానని, ఇవాళ మీటింగ్ బాగా జరిగిందన్నారు.

Also Read : Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!

Show comments