Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహ్మత్ నగర్ డివిజన్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తు పై ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి అండగా నిలవాలని స్థానిక ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవారికి అండగా ఉండే పార్టీ అని కొనియాడారు.
READ MORE: Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్ షోలో తలపడ్డ స్టార్ హీరోయిన్లు..
“సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు దోచుకుతిన్నారు. బీఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హవా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ మా అభ్యర్థి గురించి మాట్లాడారు అంటే మా విజయం అక్కడే అర్థం అవుతుంది. నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే పోయిన ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు బయట పెట్టాలి. కావాలని మా అభ్యర్థిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పీపుల్ అని అందరూ అనుకుంటారు కానీ ఇది మాస్ ఏరియా. మాస్ ఏరియా వాళ్లకి అభివృద్ధి, సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే గుర్తు వస్తుంది. కంటోన్మెంట్స్ లో సెంటిమెంట్ వర్క్ అవుట్ అవలేదు ఇక్కడ కూడా కాదు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ ను జూబ్లిహిల్స్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కచ్చితంగా యువకుడు అయినా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు.” అని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.