NTV Telugu Site icon

Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై స్పందించిన రాజగోపాల్‌ రెడ్డి..

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు ఇతర పార్టీలకు వలసలు పోతున్నారు. అయితే.. గతంలో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మారుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇస్తూ.. నేను చచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత నెలకొంది. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఈ ఆడియోను ఆయుధంగా చేసుకొని ప్రత్యర్థులు విజృంభిస్తున్న క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. సోదరుడు వెంకట్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన ప్రజలకోసం కృషి చేసే వ్యక్తి అని అన్నారు రాజగోపాల్‌ రెడ్డి.
Read Also : TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు అదిరేపోయే న్యూస్‌.. ఆ డబ్బులు చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌

టీఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యిందని, కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వారిని.. ఏడ్చే మొగవాడిని నమ్మ వద్దంటూ ఆయన విమర్శలు చేశారు. కవిత, రేవంత్ మధ్య ఆర్ధిక, ఇతర సంబంధాలు ఉన్నాయని, కవిత, రేవంత్ పాట్నర్‌లు అని, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో టీఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన వారు చాలా మంది తను గెలువాలని కోరుకుంటున్నారన్నారు రాజగోపాల్‌రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియంత కేసీఆర్ తో యుద్ధం జరుగుతుందని, తెలంగాణ భవిష్యత్ మునుగోడు ఎన్నిక మీద ఆధార పడిందని రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.