శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Also Read:Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే..?
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించిభంగపడ్డారు రాజగోపాల్ రెడ్డి. ఈ క్రమంలో తొలిసారిగా ధిక్కారస్వరం వినిపించారు. పాలమూరులో 2034 వరకు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను x ద్వారా రాజగోపాల్ రెడ్డి ఖండించారు.
