Komatireddy Raj Gopal Reddy: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి పట్టణoలో కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం తరుపున ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పులేదు గానీ.. నకిరేకల్ అభివృద్ధి కోసం తాను పార్టీ మారితే తప్పని అనడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నమ్మక ద్రోహం చేసిన లింగయ్యను ఓడగొడుతా అంటూ మండిపడ్డారు. మునుగొడులో నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడగొట్టిన లింగయ్యను వదిలి పెట్టను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తను కాంగ్రెస్ లో చేరక ముందే వీరేశంకు టికెట్ ఇప్పించారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తొక్కనియ్యనని అన్నారు. తాను యుద్ధం చేయడం మొదలు పెడితే లింగయ్య కాలు చేయి తీయడం కాదు.. లింగయ్యను ఖతం చేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 50 మంది దొంగలకు టికెట్ ఇచ్చాడు కేటీఆర్.. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ గెలవదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
నకిరేకల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమూర్తి లింగయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో నక్రేకల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే మళ్లీ విజయం సాధించాయన్నారు. నకిరేకల్ నియోజకవర్గం శాంతియుతంగా ఉండాలంటే చిరుమూర్తి లింగయ్య మళ్లీ ఎమ్మెల్యే కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. తమ్ముడు వేరే పార్టీలో ఉంటే తప్పులేదు కానీ.. నకిరేకల్ అభివృద్ధి కోసం తాను పార్టీ మారితే తప్పని అనడం ఎంత వరకు కరెక్టని అని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో లేరని, మా నేతలపై విరుచుకుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో తనకు కోమటిరెడ్డి బ్రదర్స్ పదవి ఇచ్చారని… ఆ పదవి పేరుతో ఇలా మాట్లాడి ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తారు? అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంను రౌడీ అని తిట్టిపోసిన కోమటిరెడ్డి సోదరులు ఈరోజు తాను గొప్పవాడినని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని చెప్పారు.
Viral: గాల్లో విమానం… చక్కెర్లు కొట్టిన గుర్రం.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్..