NTV Telugu Site icon

Komatireddy Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు.. ఎవరి మాట వినా..

Raja Gopal

Raja Gopal

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం మునుగోడులో బెల్ట్ షాపులు ఉండవని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఎవరి మాట విననని అన్నారు. పదవి పోయినా బెల్ట్ షాపులను తెరవనివ్వనని కరాఖండిగా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయమని అన్నారు.

Read Also: Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..

రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది.. మొదటిసారి మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలకగా… నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్ రెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు.. భూనిర్వాసితులకు వందశాతం న్యాయం చేస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read Also: Parvathipuram: పాలకొండలో రెచ్చిపోయిన దొంగలు .. దిశా ఎస్సై ఇంట్లో చోరీ

Show comments