Komati Reddy Venkat Reddy: కేటీఆర్ పై మంత్రి కోమటి రెడ్డి ఫైర్.. మా పార్టీ గురించి నీ తండ్రిని అడుగు అంటూ..
- కేటీఆర్ పై మంత్రి కోమటి రెడ్డి ఫైర్
- మా పార్టీ గురించి నీ తండ్రిని అడుగు అంటూ
- తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోమటి రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం.. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..?.. నీ తండ్రిని అడుగు మా పార్టీ గురించి చెప్తాడు.. నీ తండ్రి కేసిఆర్, నువ్వు నీ కుటుంబం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూప్ ఫోటో దిగింది మర్చిపోయారా..? మా పార్టీ పెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది.. సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు.
Also Read:BSNL Triple Play Services: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.400కే ట్రిపుల్ ప్లే సర్వీసెస్..
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు.. మీ తెలంగాణ వాదం పై సందేహాలు తలెత్తుతున్నాయి.. తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు.. లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బుతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావ్.. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు.. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై చులకనగా మాట్లాడడం..అమెరికాలో చదివిన నీ చదువు విజ్ఞతకు వదిలేస్తున్న.. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పిఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ.. రాజకీయంతో సంబంధం లేకుండా దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ.. యూరియా ఎందుకు రావట్లేదో నీకు అంత మాత్రం తెలియదా?
Also Read:Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన బొత్స
కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే నువ్వు అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్.. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానిపై క్యాబినెట్ లో చర్చించాం.. అవినీతి చేయకుంటే ఢిల్లీ నుండి లాయర్లను తెప్పించి హైకోర్టుకు ఎందుకు వెళ్లారు.. మీ అవినీతి ప్రజల ముందు పెడతాం.. మీకు ఏ శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.. జగదీష్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయికి నేను దిగజారలేదు.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక్కనాడు మహాత్మగాంధీ యూనివర్సిటీ కి పోలేదు..నేను ఇప్పుడు లా, ఫార్మసీ కోర్సులు కొత్తగా తెచ్చాను.. YTPS మీద విచారణ జరుగుతుంది. ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో తేలుస్తాం.. ఉత్తంకుమార్ రెడ్డి గురించి, నా గురించి మాట్లాడేంత స్థాయా మీది.. నల్గొండకు ఏం చేశామో ప్రజలకు తెలుసు.. త్వరలోనే నీ బాగోతం బయటపడుతుంది అంటూ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!