Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, నటీనటుల పారితోషికాలు భారంగా మారడంతో శనివారం తమిళనాట షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకేసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్స్ తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునే ‘ప్రాఫిట్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ పిలుపు మేరకు ఒక్కరోజు టోకెన్ సమ్మెను నిర్వహించారు.
భారీ పారితోషికాల వల్ల తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని, నిర్మాతలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన రెవెన్యూ షేరింగ్ విధానంపై తమిళ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నిర్మాతలు ఈ నిరసన బాట పట్టాల్సి వచ్చింది. శనివారం ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో ఈ టోకెన్ సమ్మె ప్రభావంతో కోలీవుడ్‌లో పలు భారీ చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. తారల రెమ్యునరేషన్లు అదుపులో లేకపోతే భవిష్యత్తులో సినిమా నిర్మాణం మరింత కష్టమవుతుందని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. మరి ఈ డిమాండ్‌పై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో, రాబోయే రోజుల్లో కోలీవుడ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!