ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కన్నా ఓటీటీలోని మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.. వేరే భాషల్లో మూవీస్ అయితే డబ్ అవ్వగానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా ఓ తమిళ్ యాక్షన్ మూవీ కూడా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది.. అసుర గురు అదే పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది.. తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.
మే 3 నుంచి తెలుగులో అసుర గురు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమా 2020 లో తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా లో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. భారీ యాక్షన్ మూవీగా వచ్చింది.. ఈ సినిమాకు రాజ్‌దీప్ దర్శకత్వం వహించాడు. తమిళంలో నాలుగేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది.. అలాంటి డిజాస్టర్ మూవీ ఇప్పుడు తెలుగులోకి రావడం విశేషం..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో దొంగ పాత్రలో నటిస్తాడు.. పోలీసులకు దొరక్కుండా ధనవంతులను టార్గెట్ చేస్తూ దోచుకుంటాడు.. అతన్ని పట్టించడం కోసం హీరోయిన్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. మూవీలో ట్విస్ట్‌లు, టర్న్‌లతో పాటు విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ పాత్రల నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను అలరించాయి. కానీ కథ రొటీన్ గా ఉండటంతో హిట్ అవ్వకలేకపోయింది..