NTV Telugu Site icon

Kollu Ravindra: సీదిరి అప్పలరాజు నోరు అదుపులో పెట్టుకో..

Kollu Ravindra

Kollu Ravindra

యువగళం పాదయాత్రపై విమర్శలు చేస్తూ మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ లేఖ రాశారు.. బహిరంగ చర్చకు సిద్దమని మేము సవాల్ ని స్వీకరించామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గరకు ఈరోజు ఉదయం11 గంటలకు రావాలని చెప్పాం.. ఇప్పటి వరకు చర్చకు రాకుండా తోక ముడిచిన మీరా లోకేష్ గురించి మాట్లాడేది.. మీ నాయకుడు మార్నింగ్, ఈవ్ నింగ్ వాక్ చేశాడు అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులు రెస్ట్ లో ఉన్నాడు.. మా లోకేష్ ఎండ, వాన లెక్క చేయకుండా పాదయాత్ర పూర్తి చేశాడు.. తండ్రి అక్రమ అరెస్టు అయితే యాత్రను ఆపి వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. మీ నాయకుడి నాన్న చనిపోతే.. సంతకాల సేకరణ చేయించిన చరిత్ర మార్చిపోయారా.. బీసీలను అన్ని విధాలా అణగ దొక్కిన చరిత్ర మీ జగన్ ది అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Read Also: Corporate Bookings: నార్త్ లో మొన్న యానిమల్, ఇప్పుడు సలార్ కి దెబ్బేస్తున్న కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటో తెలుసా?

బీసీలకు అందాల్సిన పథకాలు, నిధులు నిలిపివేశారు అంటూ కొల్లు రవీంద్ర ఆరోపించారు. మీ సీట్ల కోసం లోకేష్ పై నోరు పారేసుకుంటారా.. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రండి.. పేపర్ పులుల్లా వాగడం కాదు.. అంశాల వారీగా చర్చకు రండి.. నీ సీట్లు కోసం బీసీ లను అడ్డు పెట్టుకుంటావా.. సిగ్గేస్తుంది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. చేతి వృత్తుల వారికి జీవనోపాధి లేకుండా చేశారు.. మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. లేదంటే నోరు మూసుకోండి అంటూ మాజీ మంత్రి రవీంద్ర మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా.. స్టేడియాల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు.. మంత్రి సీదిరి అప్పల రాజు నోరు అదుపులో పెట్టుకో.. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు.. ఇంకో సారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.