Site icon NTV Telugu

KKR vs GT: గిల్ విధ్వంసం.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

Gill

Gill

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొంటోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, KKR కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Also Read:Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

ఇద్దరు జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చి KKR బౌలర్లకు చెమటలు పట్టించారు. 10 ఓవర్లలో, ఇద్దరూ వికెట్ కోల్పోకుండా 89 పరుగులు సాధించారు. గిల్ కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్ బాది 52 రుగులు చేశాడు. 13వ ఓవర్‌లో సాయి సుదర్శన్ 52 పరుగుల వద్ద ఔటవడంతో గుజరాత్‌కు తొలి దెబ్బ తగిలింది. గిల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సులతో 90 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. బట్లర్ మ్యాచ్ చివరలో మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లో 8 ఫోర్లు బాది 41 పరుగులు సాధించాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 199 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Exit mobile version