ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 7వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని మాట ఇస్తూ ముందుకు సాగారు. ఇక, తిరువూరులోని 7వ వార్డులో ముస్లిం మహిళలు కొలికపూడి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్లకార్డులు పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ వార్డులో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు, అలాగే ఇతర సామాజిక వర్గాలకు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు.
Read Also: Salman Khan House Firing Case : ‘చిత్రహింసలు పెట్టి చంపేశారు’.. అనుజ్ కుటుంబ సభ్యుల ఆరోపణ
ఇక, ఈ వార్డులో ఉన్న మంచినీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను రాబోయే రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం జరుగుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికి వెళ్లి చెప్పడం జరిగింది. మరొక ముఖ్య విషయం తిరువూరు మండలంలోని కోకిలంపాడు, మునుకోల్ల గ్రామాలలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 5వ తేదీన ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
