Site icon NTV Telugu

Kolagatla Veerabhadra Swamy : రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు

Veeerabhadra Swamy

Veeerabhadra Swamy

కుప్పం మునిసిపాలిటీ లో ఓడిపోయిన చంద్రబాబు మా కోసం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు మీ కంటికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. రాత్రి చంద్రబాబు బస చేసిన బంగ్లాలోనే ఎన్టీఆర్‌పై కుట్రకు అంకురార్పణ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా వైసిపి మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. మేము ఎక్కడైనా భూములు కబ్జా చేస్తే చూపించాలని, లేనిపోని ఆరోపణలు చేసి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారన్నారు. మూడు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ‌ అధినేత పర్యాటించారు.. పదేపదే సైకిల్ పోవాలి పోవాలని అంటున్నావు… ఇప్పటికీ పంపించారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల వస్తే మేము గెలుస్తామో లేదో గానీ.. కుప్పంలో నువ్వు గెలిస్తావో లేదో చూసుకో అని ఆయన అన్నారు.
Also Read : GVL Narasimha Rao : కుటుంబ పాలన దేశానికి పట్టిన చీడ

ప్రభుత్వ పథకాలుపై ఏనాడైనా మీరు ఇంటింటికీ వెళ్లి అందుతున్నాయా అని అడిగారా… మేము ఉప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్తున్నామని, హైదరాబాదులో ఉంటూ ఏదో పబ్బం గడుపుకోడానికి వచ్చావా అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పదవికి స్కెచ్ వేసిన బంగ్లాలో ఉండి నేడు మళ్లీ ఏం చెయ్యడానికి బంగ్లాలో మకాం వేశారా అని ప్రజల ఆందోళన చెందుతున్నారన్నారు. సమావేశాలను ప్రజలని తరలించి విజయవంతమని చెప్పుకుంటున్నారు… మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని విమర్శిస్తున్నారు… కేవలం బ్లాక్ మార్కెట్ లో దొరకదు… ప్రభుత్వమే నేరుగా మీకు అందిస్తుంది… జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్లడబట్టే నిన్ను ఇంటికి పంపారు..‌ దిశా చట్టం ద్వారా మహిళలపై అఘాయిత్యా జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నాం.. విశాఖలో పరిపాలన రాజధాని వద్దని చెబుతున్నావు.. అదే జరిగితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని అక్కసు నీది… విజయనగరంలో మళ్లీ ఇప్పుడు అశోక్ ని తెరపైకి తీసుకొస్తున్నావు… నీకు ఓటమి భయం మొదలైంది అని అర్ధమైపోతుందని ఆయన అన్నారు.

Exit mobile version