Site icon NTV Telugu

Virat Kohli: యువ ఆటగాడికి కోహ్లీ పాఠాలు.. చెప్పినట్లు చేస్తే చెలరేగడమే..!

Kohli

Kohli

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు. సీనియర్ బౌలర్లైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ లో కోహ్లీ ప్రాక్టీ్స్ చేస్తున్నాడు.

New Born Sold for Rs.800: రూ.800 కోసం 8 నెలల చిన్నారిని అమ్మేసిన కసాయి తల్లి

ప్రాక్టీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ రివర్స్ స్వీప్ షాట్స్ ను ప్రాక్టీస్ చేశాడు. ఆయన ఇంతవరకు ఎప్పుడు రివర్స్ స్వీప్ షాట్లు ఆడలేదు. అయితే అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ ఆడే రివర్స్ స్వీప్ షాట్ కు జడ్డూ భాయ్ మెస్మరైజ్ అయ్యాడు. అయితే ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాకుండా యువ ఆటగాడికి పాఠాలు నేర్పించాడు కోహ్లీ. గత ఐపీఎల్ లో దుమారం రేపిన యశస్వి జైస్వాల్ టెస్ట్ ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. అయితే అందుకు సంబంధించి కోహ్లీ దగ్గర కొన్ని బ్యాటింగ్ టిప్స్ నేర్చుకున్నాడు. కోహ్లీతో చాలా సేపు గడిపిన యశస్వి.. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు.

PM Modi: వరంగల్‌కు ప్రధాని.. రూ.6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన.. వివరాలు ఇవే

డొమినికా వేదికగా జూలై 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా బ్యాట్స్ మెన్స్ నెట్ ప్రాక్టీస్ లో బిజి బిజిగా గడుపుతున్నారు. మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ లో యశస్వితో పాటు.. కొందరు యువ ఆటగాళ్లు ఆడనున్నారు.

 

Exit mobile version