టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతని బ్యా్ట్ ద్వారా పరుగుల కోసం చాలా కష్టపడుతున్నాడు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు కోహ్లీ బుధవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మెల్‌బోర్న్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు కోహ్లీ. పెర్త్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అతడి బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కాగా.. ఆన్ ఫీల్డ్‌లో ఇలా బ్యాట్‌తో ఇబ్బందులు పడుతుంటే.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ రోడ్డుపై తిరుగుతున్నారు. ఇద్దరూ కాలినడకన వెళ్తున్నారు. కోహ్లీ, అనుష్క ఇద్దరూ బ్లాక్ కలర్ టీషర్ట్‌లు ధరించారు. ఇండియా వీధుల్లో తిరగాలనే కోరిక ఉండేది.. కానీ సాధ్యపడలేదని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే విదేశాల్లో అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీ ఇలా వీధుల్లో తిరుగుతున్నాడు. ఇటీవల, విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు మారనున్నాడని చిన్ననాటి కోచ్ రాజేంద్ర శర్మ చెప్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తరచూ లండన్‌కు వెళుతున్నాడు. అక్కడ ఇల్లు కూడా కొనుకున్నాడు.
Read Also: Kerala: వేగంగా వస్తున్న రైలు.. ట్రాక్ మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరికీ.. (వీడియో)
ఆస్ట్రేలియాలో కోహ్లీ ఎప్పుడూ మంచి ఇన్నింగ్స్ ఆడేది. కానీ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ పిచ్‌పై కోహ్లీకి మంచి పట్టు ఉంది. ఈ స్టేడియంలో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 52.66 సగటుతో 316 పరుగులు చేశాడు. అందులో సెంచరీ కూడా ఉంది. ఈ పిచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానే, సచిన్ టెండూల్కర్ అతని కంటే ముందున్నారు.
Virat Kohli And @AnushkaSharma Spotted Strolling On The Streets Of Melbourne.🥰♥️#Virushka #INDvAUS #AUSvIND @imVkohli pic.twitter.com/bwIEnWpOSn
— virat_kohli_18_club (@KohliSensation) December 24, 2024