Site icon NTV Telugu

Kodanda Reddy : ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేస్తోంది

Kodandareddy

Kodandareddy

కాంగ్రెస్ పార్టీ భూములు పంచిపెడితే… కేసీఆర్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు అమ్మేస్తున్నాడని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం మల్టీ నేషన్ కంపెనీకి 2 వేల ఎకరాల అసైన్ భూమి ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్నా విలువైన భూముల్లో 300 గజాలు ఇస్తున్నామని చెప్పి ఇతర భూములు వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. గజ్వేల్ లో 1500 ఎకరాల అసైన్ భూములను గుజరాత్ కంపెనీ కి ఇచ్చారన్నారు కోదండరెడ్డి.

Also Read : Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!

ఇప్పటి వరకు 10 వేల ఎకరాల అసైన్ భూమిని వివిధ కంపెనీ లకు కట్టబెట్టారని, పేదల భూముల విషయం లో అన్ని రాజకీయ పార్టీ లు కలిసి ప్రయాణం చేస్తామన్నారు కోదండరెడ్డి. ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేస్తుందని, అసైన్మెంట్ భూములు రెవెన్యూ చట్టం ప్రకారం అమ్మడానికి లేదని కోదండరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డులు సరిదిద్దడం కోసం 2లక్షల సిబ్బందిని నియమించారన్నారు. తెలంగాణలో పూర్వీకులు సంపాదించుకున్న భూమి కూడా ఇంత వరకు ఖాతాలో ఎక్కలేదన్నారు. కానీ ఆంధ్రాలో పట్టాదారు పాసుపుస్తకంలో అన్ని వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. దేశంలో తొలిసారి యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని ముసాయిదా చేసిందని ఆయన తెలిపారు.

Also Read : Chandrababu Arrest: ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలే చంద్రబాబుకు సేఫ్‌..! కోర్టులో వాదనలు

Exit mobile version