NTV Telugu Site icon

Kodanda Reddy : ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన

Kodandareddy

Kodandareddy

ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 23 వ తేది వరకు అందరి సలహాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ధరణిలో జరిగినవి మాములు తప్పులు కాదని, అన్ని సంఘాలు…పార్టీల నేతలతో అభిప్రాయాలు సేకరించామన్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్ళు రెవెన్యూ అధికారులకు ఐనా తమ అభిప్రాయాలు పంపండన్నారు.

Waqf Bill: ‘‘రాజ్యాంగంపై దాడి’’.. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్‌ సహా విపక్షాల ఆందోళన..

రుణమాఫీ మాములు నిర్ణయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ధరణి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నదని కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తాము అధికారంలోకి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 2 లక్షల అప్లికేషన్లను పరిష్కరించగలిగామన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాలేదని విమర్శించారు. మీటింగ్ కు రాకపోయినా పర్వాలేదు కానీ మీ పార్టీ సలహాలు సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి కనీసం రాతపూర్వకంగానైనా పంపించి సహకరించాలని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం అని అందువల్ల అందరూ సహకరించాలని కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దనే ప్రయత్నం అని చెప్పారు.

Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్