Site icon NTV Telugu

Kodanda Reddy : భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయి..

Kodanda Ram

Kodanda Ram

ఇందిరా గాంధీ భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములు కేసీఆర్‌ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి, మెదక్, నల్గొండ లో ఆ భూములను చట్ట విరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తున్నారని, బుద్వెల్ లో 282 ఎకరాలు దళితులకు భూ సంస్కరణల చట్టం కింద పంచారన్నారు. 1995 లో టీడీపీ హయాంలో అసైన్ భూమి అని ఆర్డివో నోటీసులు ఇచ్చారని, హైకోర్టు దళితులకు ఇచ్చిన భూములు లక్కోవడానికి లేదని 2008 కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ భూములు ఇప్పటి వరకు దళితుల చేతిలోనే ఉన్నాయన్నారు కోదండరెడ్డి. హెచ్‌ఎండీఏ వంద ఎకరాల వరకు ఈవేళం వేసిందని, 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఉంటే 10 వేల ఎకరాల అసైన్ భూములను బిల్డర్స్ కి అప్పగించారన్నారు కోదండరెడ్డి. భూములు రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయని, భూములు అమ్మకంలో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు.

Also Read : Exercise:వర్షాకాలంలో వాకింగ్ చేయడం కుదరడం లేదా? ఇంట్లోనే ఇలా ఎక్సర్‌సైజ్‌ చేసుకోండి

ధరణి లోపాల విషయంలో ప్రభుత్వంని వదలం.. న్యాయపోరాటం చేస్తామన్నారు. గ్రామాల్లోకి తిరగనివ్వమని, ఒక్కో గ్రామంలో దళితుల దగ్గర 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారన్నారు కోదండరెడ్డి. ఇందిరా గాంధీ పంచిన భూములు పేదలకు అందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, ఈ భూముల అమ్మకం చెల్లదని, యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టం తేవడానికి సర్వేలు చేయడానికి డబ్బులు కూడా కేటాయించిందన్నారు. నేను హుడా చైర్మన్ గా ఉన్నప్పుడు 5 అంతస్థుల పైన కట్టద్దు అని నిర్ణయం తీసుకున్నామని, 100 కోట్ల ఎకరానికి అమ్మిన భూమిలో ఎస్‌ఎఫ్‌ఐ లిమిట్ లేదు ఎన్ని అంతస్థులు అయినా కట్టుకోవచ్చన్నారు. ఫ్లైట్ పోయే మార్గంలో ఇలాంటి నిర్మాణలు ఉండద్దు అని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : Lot Mobiles: లాట్ మొబైల్స్‌11వ వార్షికోత్సవ ఆఫర్లు.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Exit mobile version