రాష్ట్రంలో ఉన్న విపత్తుపై రెండు కమిటీలు ఏర్పాటు చేసామని, ఒక కమిటీ అన్నీ ప్రాంతాలతో సమన్వయం చేయడానికి, రెండవది పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించడానికి అని ఆయన అన్నారు. ఈ విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణమని, పంట నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు కూడా చెప్పినా.. ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందన లేదన్నారు కోదండరెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవసాయశాఖా మంత్రికి వినతిపత్రం ఇచ్చామని, రాష్ట్రం అతలాకుతలం అయిందన్నారు కోదండరెడ్డి. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అందడంలేదని కమిటీ గుర్తించిందన్నారు. ఉచిత మందులు పంపిణీ చేసి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని కమిటీ కోరుతుందని, జిల్లాల వారిగా రివ్యూ నిర్వహించి జరిగిన నష్టాన్ని సేకరిస్తామన్నారు కోదండ రెడ్డి. కేంద్రానికి దరఖాస్తు కూడా పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని కోరుతున్నామన్నారు.
Also Read : MP Nandigam Suresh: సీఎం జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు ఉన్నారు..
ఇది రాజకీయాల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని, జరిగిన విపత్తు పట్ల ప్రజలకు అండగా నిలబడాలనే ముందుకు వెళ్తున్నామన్నారు కోదండరెడ్డి. అనంతరం.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఫ్లడ్ కమిటీ వేయడం జరిగిందని, అన్ని జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేశామన్నారు. ములుగు లాంటి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీష్ రావ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్లడ్ రిలీఫ్ కమిటీ వేశామని, కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా స్థాయి నాయకులను అప్రమత్తం చేసామన్నారు. ఆహారం ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఏదైనా అవసరాలకోసం 040 – 24602383, 040 – 24601254 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.
Also Read : Apple Shoe’s : యాపిల్ కంపెనీ బూట్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
