NTV Telugu Site icon

Kodali Nani: భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం

Kodali Nani

Kodali Nani

టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో టెన్షన్ నెలకొన్న వేళ ఆయన సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు, రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వంగవీటి రంగాను పొట్ట పెట్టుకున్న పార్టీలు ఏ స్థాయికి వెళ్లాయో చూస్తున్నాం.రంగాని పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నించారు.రంగాను గౌరవించని వ్యక్తులు కూడా ఇప్పుడు బూట్లు నాకాల్సిన పరిస్థితి.రంగా మాకు ఆదర్శ ప్రాయుడు.రంగా కుటుంబం వెనుక.. ఆయన అభిమానుల వెనుక అండగా ఉంటాం.అంబేద్కర్, ఎన్టీఆర్, రంగా వంటి వారు పార్టీలకు అతీతంగా ప్రదల గుండెల్లో నిలబడిన వ్యక్తులు.

రంగాను హతమార్చిన టీడీపీ.. అంబేద్కర్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలకు ఏ గతీ పెట్టిందో తెలుసు.ఎన్టీఆరును, రంగాను చంపిన వ్యక్తులే దండేసే నైజం టీడీపీది.నిన్న రావికి.. రంగా అభిమానులకు జరిగిన గొడవ.రంగా చనిపోయాక రావి కుటుంబం ఆస్తుల మీదే దాడి చేశారు.మా ఆస్తుల మీద దాడి చేయలేదే..?రావి బట్టల షాప్ మీద దాడి చేయలేదా..?రంగా హత్య తర్వాత రావి గుడివాడ నుంచి పారిపోయాడు.శోభనాద్రీని రంగా అభిమానులు బూటు కాలితో తన్నలేదా..?రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు, దేనినేని ఉమ ఏ పార్టీలో ఉన్నారని నాని ప్రశ్నించారు.

Read Also: India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..

నేను ఎన్నో రంగా విగ్రహాలు పెట్టించా.. రావి ఎన్ని పెట్టించారు..?దేవినేని నెహ్రు వంగవీటి మోహన్ రంగాను చంపలేదు.ఆనాటి ప్రభుత్వమే రంగాను చంపింది.వ్యక్తులు రంగాను చంపలేరు.. వ్యవస్థే చంపింది.తనకు రాజకీయంగా అన్యాయం జరిగిందని రాధా భావించవచ్చు.రాధా మనస్సు గాయపడింది.. పార్టీ నుంచి వెళ్లిపోతానన్నారు.దానికీ రాజకీయాలకు సంబంధం లేదు.రాధా మా కుటుంబ సభ్యుడు.రాజకీయాలు వేరు.. అభిమానం వేరు.నాకు మంత్రి పదవి పోయింది.. నాకు జగన్ అన్యాయం చేశాడా..?మంత్రి పదవి ఇవ్వలేకతున్నానని నాకు చెప్పారు.నేను తెలుగుదేశంలో ఉండగా రంగా విగ్రహావిష్కరణలకు వెళ్లానన్నారు నాని.

అప్పుడు చంద్రబాబు నన్ను తిట్టాడు.ఇప్పుడు రంగా విగ్రహావిష్కరణకి వెళ్లాలని అదే చంద్రబాబు చెబుతున్నాడు.రాధాతో నా ప్రయాణం పార్టీలకు అతీతం.రంగా అభిమానిగా కాళీ ఫోన్ చేసి రావితో మాట్లాడారు.దీనికి, పార్టీకి ఏం సంబంధం..?నిన్న సాయంత్రం జరిగింది.. ఓ కామెడీ ఎపిసోడ్.ఫోన్లు చేసి చంపుతామని చెబుతారా..?ఓ అయ్యప్ప మాల వేసుకునో.. పాలు పోస్తూనో ఓ పోటు పొడిచి వెళ్లిపోతారు.గుడివాడలో నన్ను ఓడించడం కష్టం.గుడివాడ ఓటర్లు నా భవిష్యత్తుని నిర్దేశిస్తారు.ఓ నాకొడుకుతోనూ నాకు నమ్మకం లేదు.మాకు ఏ పార్టీతో పొత్తు అక్కర్లేదు.ఎవ్వరి బూట్లు నాకం.దటీజ్ వైఎస్సార్సీపీ.. దటీజ్ జగన్.ఇచ్చిన హామీలను చెప్పినట్టుగా అమలు చేశాం.మీకు ఇష్టం అయితే ఓట్లేయండి.. లేకుంటే పీకి పక్కనేయండని జగన్ చెబుతున్నారు.బాధ్యతతో లేకుంటే ఓడిపోతామనే భయం నాకు, జగనుకు ఉంది.భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం.భయం.. భక్తితో నా బాధ్యతని నెరవేర్చే ప్రయత్నం చేస్తా.భయం, భక్తి లేని గాలి నా కొడుకులం కాదు అన్నారు కొడాలి నాని.

Read Also: KKD Death Permission: ప్లీజ్.. చనిపోయేందుకు అనుమతివ్వండి