NTV Telugu Site icon

Kodali Nani: జూ.ఎన్టీఆర్, లోకేష్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పై హాట్‌ కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పెద్ద ఎన్టీఆర్‌, చిన్న ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు చంద్రబాబును ఓడించాలంటూ పిలుపునిచ్చారు కొడాలి నాని. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరు చంద్రబాబును గోతిలో పాతి పెట్టాలి.. అప్పుడే ఎన్టీఆర్ చేతిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తుందన్నారు.

Read Also: MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..

పనికిరాని చంద్రబాబు, లోకేష్ ని గెలిపిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే.. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని విమర్శించారు. ఇక, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రెండు లక్షల 50వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోసం.. ప్రజలు రెండుసార్లు ఈవీఎం బటన్ నొక్కాలని సూచించారు. చంద్రముఖిని ఈ ఒక్కసారి ఈవీఎంలో బంధిస్తే… చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కాగా, మంగళగిరి వేదికగా ఈ రోజు టీడీపీ – జనసేన ఉమ్మడిగా జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో.. కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది..