Site icon NTV Telugu

Kodali Nani: చంద్రబాబును అరెస్ట్‌ చేయక ముద్దు పెట్టుకుంటారా?

Kodali Nani

Kodali Nani

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అవినీతి పనులు చేసే చంద్రబాబును అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరు? అని నిలదీసిన ఆయన.. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయమా..? పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు.. ఇక, దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే.. చంద్రబాబు పాల వ్యాపారం పెట్టారని ఆరోపించారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు చెప్పాలి.. చంద్రబాబులా సెల్ఫీలు తీసుకొని చెప్పుకోవడమెంటో..! అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తానే కట్టననే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ రాదు అని దుయ్యబట్టారు.. పిట్టల దొర లేని లోటుని ఆయన తీరుస్తున్నాడు అని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.

Read Also: Pawan Kalyan: ఉస్తాద్ యాక్షన్ లోకి దిగాడు… సినిమా ఏదైనా గన్ కామన్

మరోవైపు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు తయారయ్యారు అంటూ చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడిన విషయం విదితమే.. ఇక, అరెస్టు పేరుతో సింపతి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు, అలాంటి సంపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లబోవన్నారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కానీ, చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చట్టానికి అడ్డుపడితే చంద్రబాబుపై చర్యలు తప్పవు అని అంబటి రాంబాబు హెచ్చరించిన విషయం విదితమే.

Exit mobile version