Kodali Nani: పాతికేళ్ల కాలం నుంచి రాజమండ్రి బాగా తెలుసని.. గడిచిన ఐదేళ్లలో రాజమండ్రి డెవలప్మెంట్ కనిపిస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో తన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మార్గాని భరత్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. రాజమండ్రి ప్రాంతాన్ని వైయస్సార్ పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత సీఎం జగన్ భరత్‌కు అప్పగించారన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ప్రాణం పోయినా జగన్ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం జగన్ వెంటే నిలబడతామన్నారు. స్కూళ్ల అభివృద్ధి కోసం చంద్రబాబు 500 కోట్లు ఖర్చుపెడితే.. జగన్మోహన్ రెడ్డి 73 వేల కోట్ల రూపాయలు పాఠశాలల కోసం ఖర్చు పెట్టారన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లక్షల మందిని సీఎం జగన్ ఆదుకుంటున్నారని కొడాలి నాని చెప్పారు.
Read Also: Kesineni Nani: తిరువూరు టీడీపీ అభ్యర్థిని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వ సంపదను పేద కుటుంబాలకు అందించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు. సిగ్గు శరం లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడుకుంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. భరత్‌ను, గూడూరు శ్రీనివాసును ఎమ్మెల్యే, ఎంపీలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొడాలి నాని ప్రజలను కోరారు. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్‌కు వార్నింగ్ ఇచ్చారని.. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వటం మగతనమా అంటూ మండిపడ్డారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో తెలియదు కానీ… మే నెలాఖరుకు సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. జన సైనికులే చంద్రబాబునాయుడిని పాతాళానికి తొక్కేస్తారన్నారు. ఇద్దరు వెన్నుపోటు దారులతో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నాడు.. ఎవరు ఎప్పుడు ఎలా వెన్నుపోటు పొడుస్తారో తెలియదన్నారు. జగన్మోహన్ రెడ్డి అందరినీ గెలిపించడానికి వ్యూహం పన్నుతాడు తప్ప… ఏ ఒక్కరిని ఓడించాలనో ఆలోచించరని అన్నారు. గుంట నక్కలతో ప్రయాణం చేసే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలన్నారు.