Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఈ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ఇతర పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి.. బీసీ సంఘం నాయకుడు దేవరపల్లి కోటి, 150 మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే నాని.
Read Also: Vijayalakshmi: ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. హీరోయిన్ వీడియో వైరల్
తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారన్నారు కొడాలి నాని.. చంద్రబాబు సామాజిక వర్గం.. ఆయన కోటరీకే టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందని విమర్శించారు. అన్ని విభాగాల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. ఇక, చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు.. దానికి నిదర్శనం గుడివాడే అన్నారు.. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా.. 150 కోట్ల రూపాయలకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు.. గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Veligonda Project: ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. నాడు నాన్న.. నేడు కొడుకు..
ఇక, ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలిపై సెటైర్లు వేశారు కొడాలి నాని.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురుంధేశ్వరి బాధపడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని స్పష్టం చేశారు. పరిమితికి మించి అప్పులు చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. ఎంపీ అవ్వడానికి బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురంధేశ్వరి ప్రయత్నిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.