NTV Telugu Site icon

Kodali Nani: రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది..

Kodali Nani

Kodali Nani

కృష్ణాజిల్లా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిన వరి పొలాలను అధికారులతో కలిసి పంట పొలాలను ఎమ్మెల్యే కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి.. తుఫాన్ సమయంలో సీఎం ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేశారు.. మా ప్రాంతంలో రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. రైతులను పూర్తిగా ఆదుకుందామని సీఎం చెప్పారు అని ఆయన తెలిపారు. ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా సహాయం చేద్దామని చెప్పారు అని కొడాలి నాని అన్నారు.

Read Also: Revanth reddy Speech: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం..

ఆర్బీకేల ద్వారా రెండు రోజుల్లో సబ్సిడీ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విత్తనాలపై రైతులు అడిగిన దానికంటే ఎక్కువగానే సబ్సిడీ ఇద్దామని సీఎం చెప్పారు.. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం.. రంగు మారినా, పని కొచ్చినా, పనికి రాక పోయినా మద్దతు ధరకే కొనాలని నిర్ణయం తీసుకుంటారని
రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దు అని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. గతంలో రైతులు పండించిన ధాన్యానికి మూడు నాలుగు నెలలకు కూడా డబ్బులు పడేవి కాదు.. కానీ ఈ ప్రభుత్వంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు వేస్తోంది.. రేపు కానీ , ఎల్లుండి కానీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు అని ఆయన చెప్పారు.