కృష్ణాజిల్లా గుడివాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. బౌద్ధ విధానంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్‌సీపీ పని చేస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసే మహాభాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతమని ఆయన వెల్లడించారు. పొత్తుల పేరిట ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు.
Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
మతతత్వ పార్టీ బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు 2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోడీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని కొడాలి నాని అన్నారు. ఏపీ భవిష్యత్ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలతో సిగ్గు లేకుండా పొత్తులు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. అనంతరం విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరివాడన్న స్ఫూర్తినిచ్చేలా ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ గ్రహాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. దళితుల పక్షపాతి అయిన ఎమ్మెల్యే కొడాలి నానికు ఎస్సీ సోదరులందరూ మద్దతుగా నిలవాలన్నారు.
Illegal Sale Ganja: గంజాయి విక్రయిస్తున్న కిలాడీ లేడీ.. టార్గెట్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లే