NTV Telugu Site icon

Kodali Nani: ఏం చేశావు బాబు..? నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా నేను, జూ.ఎన్టీఆరే..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలన్నర ఆయన.. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నాం.. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు.. అందుకే బస్సులో చంద్రబాబు పడుకున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్ళి పడుకున్న చంద్ర బాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: IPL 2023 : కోల్ కతా నైట్‌రైడర్స్‌ ను ఢీ కొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్..

నిమ్మకూరులో ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పించారు.. నిమ్మకూరుకు ఎంతో చేశామని చెప్పడానికి సిగ్గుందా? అని మండిపడ్డారు కొడాలి నాని.. అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది కూడా చంద్రబాబు కాదు.. నేను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షల రూపాయలు పెట్టి 2003లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశాం అన్నారు.. భూమి కొనుగోలు చేసి విగ్రహాలు పెట్టించాం.. ఆ సమయంలో నిమ్మకూరులో రూ.3 లక్షలకు ఎకరా భూమి ఉంది.. ఆ డబ్బులతో భూమి కొనుగోలు చేస్తే చాలా భూమి వచ్చేదన్నారు.. అసలు నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవన్నారు కొడాలి నాని..

కాగా, నిమ్మకూరులో పర్యటించిన చంద్రబాబు.. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. తెలుగుభాష పై మక్కువతో, తెలుగుజాతి పై అభిమానం తో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చూపిన బాట లోనే టీడీపీని నడిపిస్తున్నాం. ముందుచూపుతో సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేశామని తెలిపారు.. ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన కుమార్తె భువనేశ్వరి నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి నిర్వహణ చూస్తున్నారు. ఆయనపుట్టిన నిమ్మకూరుకి అవసరమైన అన్నిపనులుచేశాం. ఈ గ్రామాన్ని లోకేశ్ దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అవికాకుండా మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటుచేశారని వెల్లడించారు.. ఇక, భెల్ కంపెనీ వచ్చాక నిమ్మకూరు కు లైఫ్ వచ్చింది. అదిపూర్తి అయితే వేల ఉద్యోగా లు వస్తాయి. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద అందరూ బాగుండాలి. సంతోషంగా ఉండాలి. అదే నాఆలోచన. ఎన్టీఆర్, తానుచేసిన పనులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు.

Show comments