Site icon NTV Telugu

Kodali Nani: అలా ఒక్కరితో చెప్పించినా పోటీ చేయను.. ప్రచారంలో కొడాలి నాని సవాల్

Kodali Nani

Kodali Nani

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు…. ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది అంటూ ఆయన వెల్లడించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి.. పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: బీజేపీ పక్షాన టీడీపీ వాళ్ళను ఎన్నికల బరిలోకి దించారు..

సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది…. సీఎం జగన్‌ది అంటూ హామీలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్.. స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నామని కొడాలి నాని స్పష్టం చేశారు.

Exit mobile version