NTV Telugu Site icon

Kodali Nani: వైఎస్‌ జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. న్యాయం చేస్తారు..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ధృడనిశ్చయంతో ఉందన్నారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్జీవో హోంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, పలువురు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.. సమావేశంలో తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగులు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పథకాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. చంద్రబాబు ప్రకటించిన పథకాలతో ఏమవుతుంది..? అని ప్రశ్నించారు. పెనం మీద ఉండడం కరెక్టా..? పొయ్యిలో పడడం కరెక్టో ఉద్యోగులు ఆలోచించుకోవాలన్నారు. మనసుతో ఆలోచించే సీఎం వైఎస్‌ జగన్ ఉద్యోగుల కష్టాలు ఇబ్బందులను కచ్చితంగా పరిష్కరిస్తారు. ఉద్యోగులను ప్రభుత్వం తమ సొంతవాళ్లుగా భావిస్తూ పేదల పథకాల కోసం కొన్ని సందర్భాల్లో వారికి ఇచ్చే నిధులు వినియోగించాం.. పేదలకు మంచి చేసిన పుణ్యం ఉద్యోగులకు కూడా దక్కుతుందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తా.. ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి ఉండాలని కోరారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

Read Also: Shraddha Das: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ..