Site icon NTV Telugu

KLR Pharmacy College: కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థులకు యాజమాన్యం వేధింపులు!

Klr Pharmacy College Palwancha

Klr Pharmacy College Palwancha

KLR Pharmacy College Ragging Case: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ బాధిత విద్యార్థిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ర్యాగింగ్‌ వేధింపులు భరించలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని శ్రుతి అనే విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Kevin Pietersen: కోపం తెచ్చుకోకండి.. ఈరోజుల్లో బ్యాటింగ్‌ చాలా తేలిక! పీటర్సన్‌ సవాల్

మూడు లక్షల రూపాయలు కడితేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తామని తనకు కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కాలేజీ యాజమాన్యం తెలిపిందని విద్యార్థిని శ్రుతి హెచ్‌ఆర్సీ ఫిర్యాదులో తెలిపింది. కాలేజీపై వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ హెచ్‌ఆర్సీని బాధిత విద్యార్థిని కోరింది. ఈ అంశంపై హెచ్‌ఆర్సీ వెంటనే స్పందించింది. విద్యార్థినికి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారి చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేసే అధికారం కాలేజీ యాజమాన్యాలకు లేదని కమిషన్ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు సూచనలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ ఆదేశించింది. నెల రోజుల్లో ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.

Exit mobile version