NTV Telugu Site icon

IPL 2025 Auction: వేలం నిర్వ‌హించిన ఆర్‌సీబీ.. కేఎల్ రాహుల్‌కు రూ.20 కోట్లు!

Kl Rahul Captaincy

Kl Rahul Captaincy

ఐపీఎల్‌ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్‌ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్‌ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ త‌న అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

అభిమానుల కోసం తాజాగా బెంగ‌ళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాక్ వేలం నిర్వ‌హించింది. ఈ వేలంలో చాలా మంది ఫాన్స్ పాల్గొన్నారు. అభిమానులు లోకేష్ రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకున్నారు. రాహుల్‌ను సొంతం చేసుకోవ‌డానికి రూ.20 కోట్లు వెచ్చిందేందుకు అభిమానులు సిద్ద‌మ‌య్యారు. మ‌రికొంతమంది ఫ్యాన్స్ యువ వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ కోసం పోటీ ప‌డ్డారు. పంత్ కోసం భారీగా వెచ్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Cricketer Son: షాకింగ్.. అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు!

గతంలో లోకేష్ రాహుల్ ఆర్‌సీబీకి ఆడిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ యాజమాన్యం కూడా ఐపీఎల్ 2025 వేలంలో రాహుల్‌ను తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకునేందుకు భారీ మొత్తం వెచ్చించనున్నట్లు సమాచారం. రాహుల్‌ను తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్‌సీబీ ఉందట. ఆర్‌సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ.83 కోట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, యశ్ దయాల్‌, రజత్ పాటిదార్‌ను మాత్రం రిటైన్ చేసుకున్నా విషయం తెలిసిందే.