NTV Telugu Site icon

KKR vs RCB: మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి..?

Rain Effect

Rain Effect

2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ రోజు కోల్‌కతాలో వర్షం పడే అవకాశం 90% ఉందని పేర్కొంది. దీని వల్ల మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే..?
ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లు, ఫైనల్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. గ్రూప్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే లేదు. ఈ క్రమంలో.. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రెండు జట్లకు చెరో 2 పాయింట్లు ఇవ్వనున్నారు. ఐపీఎల్ నియమాల ప్రకారం.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఆటను 60 నిమిషాల వరకు పొడిగించేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్ ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 5-5 ఓవర్ల మ్యాచ్‌ను జరిగించడానికి కట్-ఆఫ్ సమయం IST కాలమానం ప్రకారం రాత్రి 10:56 గంటలు, ఆట మరుసటి రోజు ఉదయం 12:06 గంటల వరకు వేచి చూస్తారు. అప్పుడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే ఇరు జట్లకు పాయింట్లు ఇస్తారు.

కోల్‌కతా-బెంగళూరుకు కొత్త కెప్టెన్లు:
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా జట్టు కెప్టెన్సీని సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు అప్పగించగా.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహించనున్నారు. ఈ కొత్త కెప్టెన్లు తమ జట్లకు ఎలాంటి ఫ్యాన్స్ మధ్య కొత్త ఆశలను తలెత్తిస్తోంది.

KKR:
అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్ (వైస్-కెప్టెన్), మొయిన్ అలీ, వైభవ్ అరోరా, క్వింటన్ డి కాక్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, మయాంక్ మార్కండే, సునీల్ నరైన్, అన్రిచ్ నోర్ట్జే, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రహ్మానుల్లా గుర్బాజ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, చేతన్ సకారియా, రింకు సింగ్, లావ్‌నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి.

RCB:
రజత్ పాటిదార్ (కెప్టెన్), అభినందన్ సింగ్, జాకబ్ బెథెల్, మనోజ్ భండాగే, స్వస్తిక్ చికారా, టిమ్ డేవిడ్, జోష్ హాజిల్‌వుడ్, విరాట్ కోహ్లీ , భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రాఠి, లుంగీ న్గిడి, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, రసిక్ సలాం, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్, నువాన్ తుషార, యష్ దయాళ్.