NTV Telugu Site icon

KKR vs PBKS : ముగిసిన పంజాబ్‌ బ్యాటింగ్‌.. కోల్‌కతా టార్గెట్‌ 192

Pbks

Pbks

ఐపీఎల్‌-2023లో మొహాలీ వేదికగా మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్‌ నష్టానికి వంద పరుగుల మార్క్‌ దాటింది. రాజపక్స 29 బంతులకు 46 పరుగులు, ధావన్‌ 21 బంతులకు 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే.. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ సౌథీ.. బౌలింగ్‌లో వికెట్‌ను సమర్పించి పెవిలియన్‌కు చేరాడు.

Also Read : Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం

తరువాత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జితేశ్‌(21) రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు రాజపక్స 50 పరుగులు చేసిన వెంటనే ఔటయ్యాడు. అయితే.. పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 పరుగులు సాధించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ 7 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకోగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా ఒక వికెట్‌ను తీశారు.

Also Read : Emergency at Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ.. పక్షిని ఢీకొట్టిన ఫెడ్ ఎక్స్ విమానం..

Show comments