Site icon NTV Telugu

KKR vs PBKS: పంజాబ్ బౌలర్లను ఆటాడేసుకున్న కేకేఆర్ బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

Kkr

Kkr

ఐపీఎల్ 2024 లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను సాధించింది. టాస్ నెగ్గిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ నిర్మిత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 261 భారీ స్కోరును సాధించింది.

Also read: Jasprit Bumrah: కంటెంట్‌ క్రియేటర్‌ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్..

మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ లు మరోసారి రెచ్చిపోయారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ 37 బంతులతో 6 ఫోర్స్, 6 సిక్సుల సహాయంతో 75 పరుగులను రాబట్టగా.. మరోవైపు ఆల్ రౌండర్ సునీల్ నరైన్ మరోసారి తనదైన బ్యాటింగ్ స్టైల్ తో కేవలం 32 బంతులలో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 71 పరుగులను చేశాడు. దాంతో మొదటి వికెట్ కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది.

Also read: World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..

ఇక వెంకటేష్ అయ్యర్ 39 పరుగులు, ఆండ్రు రస్సెల్ 12, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కేకేఆర్ భారీ స్కోరును చేయగలిగింది. పంజాబ్ బౌలర్స్ విషయానికి వస్తే.. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, శ్యామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్లు చెరో వికెట్ తీశారు.

Exit mobile version