NTV Telugu Site icon

Shah Rukh Khan-Ganguly: సౌరవ్ గంగూలీని ఆశ్చర్యపరిచిన షారుఖ్.. వీడియో వైరల్!

Shah Rukh Khan Ganguly

Shah Rukh Khan Ganguly

Shah Rukh Khan Kisses Sourav Ganguly: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీని బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ఆశ్చర్యపరిచారు. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో గంగూలీని వెనకాల నుంచి వచ్చి షారుఖ్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు ఆప్యాయంగా దాదాను ముద్దాడాడు. షారుఖ్‌ చర్యతో ముందు ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్ (35) టాప్ స్కోరర్. కుల్దీప్ కూడా త్వరగా పెవిలియన్ చేరితే.. ఢిల్లీ 100 పరుగులకే ఆలౌట్ అయ్యేది. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Also Read: Philip Salt: ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్!

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం ఢిల్లీ డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీ తమ ఆటగాళ్లతో మాట్లాడుతుండగా.. కోల్‌కతా సహయజమాని షారుఖ్‌ ఖాన్‌ మైదానంలోకి వచ్చాడు. దాదాను వెనకాల నుంచి వచ్చి హత్తుకుని.. బుగ్గ మీద ముద్దు పెట్టాడు. తర్వాత బాలీవుడ్‌ బాద్‌ షాని హత్తుకున్న గంగూలీ.. కాసేపు మాట్లాడుకున్నారు.

Show comments