Philip Salt: ఫిల్ సాల్ట్ విధ్వంసం.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Philip Salt Becomes 1st Batter To Hit Most Runs in Eden Gardens: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరో అద్భుత విజయం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది.154 పరుగుల లక్ష్యంను కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సాల్ట్ బ్రేక్ చేశాడు.
ఓ ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫిల్ సాల్ట్ రికార్డుల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో సాల్ట్ 344 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. 2010 సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో దాదా 7 ఇన్నింగ్స్‌ల్లో 331 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్, క్రిస్ లిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2019లో రసెల్ 7 ఇన్నింగ్స్‌ల్లో 311 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2018లో లిన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులు బాదాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా ‘ఎగ్ ఫ్రీజింగ్’.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అద్భుత విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. మూడు విజయాలు సాధిస్తే.. అధికారిక బెర్త్ దక్కుతుంది. కేకేఆర్ ప్రస్తుత ఫామ్ చూస్తే ప్లే ఆఫ్ చేరడం పక్కా.
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!