Site icon NTV Telugu

KKR vs RR : 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోర్‌ ఇలా

Kkr

Kkr

ఐపీఎల్‌ 16వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. అయితే.. నేడు కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ మొద‌ట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్ దిగింది. అయితే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 10 ఓవ‌ర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నితీశ్ రాణా(22), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(24) లు క్రీజులో ఉన్నారు.

Also Read : Monkeypox: మంకీపాక్స్‌పై ఎమర్జెన్సీ ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ

అయితే.. ఫామ్‌లో ఉన్న జేస‌న్ రాయ్‌ 10 పరుగులకే ఔట్ కావడంతో కోల్‌క‌తాకు భారీ షాక్ తగిలినట్లైంది. బౌల్ట్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్ అందుకోవ‌డంతో 14 ప‌రుగుల(2.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా తొలి వికెట్‌ను కోల్పోయింది. అలాగే.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. దీంతో 29 ప‌రుగుల(4.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది. అయితే.. ఇరుజ‌ట్ల‌ది ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ప‌ది పాయింట్లతో ఉన్న‌ రాజ‌స్థాన్ ఐదో స్థానంలో, కోల్‌క‌తా ఆరో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్ గెలిస్తే నాలుగో ప్లేస్ సొంత‌మవుతుంది. అందుకుని రెండు జట్లు విజ‌యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి.

Exit mobile version