Pushpa 2 : ‘పుష్ప-2’లోని ‘కిసిక్’ సాంగ్‌పై లేటెస్ట్ అప్ డేట్.. ఎప్పుడు రిలీజ్ అంటే ?
- కిసిక్ సాంగ్ పై క్రేజీ అప్ డేట్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్
- డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికుల దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి పక్కన పెడితే అన్ని పెద్ద సిటీలలో ఒక్కొక్క పెద్ద ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక హైదరాబాదులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also:Gautam Adani: బిలియన్ డాలర్ల లంచం ఇచ్చాడని అమెరికాలో అదానీపై కేసు
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రెండు చోట్ల ఎక్కడ చేస్తే బెటర్ అనే విషయం మీద ఫైనల్ చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
Read Also:IPL 2025 Auction: అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే.. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘కిసిక్’పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సాంగ్‌లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల డ్యాన్స్ చేస్తుండడంతో ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన లిరికల్ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో బన్నీ, శ్రీలీల చేసే డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!