Site icon NTV Telugu

Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందన్నారు. మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనేదానిపై ఎన్నికల మీటింగ్ లో చర్చ జరిగిందన్నారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామన్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ రెడీ అయ్యాదని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయి. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. ప్రజలనుంచి సానుకూల స్పందన కనబడుతోందన్నారు. మా ప్రతిపక్షాలు నైరాశ్యంగా ఉన్నాయన్నారు. వారికి తమ భవిష్యత్తు అంధకారంలో కనబడుతుందన్నారు. గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామన్నారు.

Read also: PV Narasimha Rao : బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి.. ఇన్నాళ్లకు దక్కిన అరుదైన గౌరవం

ఎంపి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పీఎం మోడీ పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే విషయాన్ని వివరించారన్నారు. రిజర్వేషన్లను నెహ్రూ అడ్డుకున్న విషయాన్ని బట్టబయలు చేశారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బిసి రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకించారని..కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని మండిపడ్డారు. మోడీ కులం పై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కులంపై రాహుల్ తప్పుడు వాఖ్యలు, అసంబద్ధ వాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీ లో ఆయన కులం చేరింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటూ ఓబీసీ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ కులగణనను ఎక్కడా అడ్డుకోలేదు.. అడ్డు పడలేదన్నారు.
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ దూరం!

Exit mobile version