Site icon NTV Telugu

Kishan Reddy: మా పార్టీ బలహీనంగా ఉంది.. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం.. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. దీనిపై తాము ఫిర్యాదు చేస్తామని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టామన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీలో అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదని గుర్తు చేశారు.

READ MORE: GVL Narasimha Rao: రాహుల్ చేసిన యాగీ ప్రజల చెవుల్లో పడలేదు.. బీహార్‌లో కాంగ్రెస్ బాగా దిగజారిపోయింది!

అనంతరం.. బీహార్ ఎన్నికలపై సైతం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టడం కట్టారు.. మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు.. ఓటు చోరీ పై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టారు.. దేశమంతా ఎస్‌ఐఆర్‌ జరగాలి. జూబ్లీహిల్స్ లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది.. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు.. ఈవీఎం హైజాక్ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా గెలిచాడు..” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Bihar Elections Result: ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ.. తిరుగులేని జయకేతనం

Exit mobile version