Kishan Reddy: నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్ తీసుకువచ్చాను.. కనీసం భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు.. ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనీసం సీఎం కేసీఆర్ రావడం లేదు.. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారు.. పసుపు బోర్డ్ పై వెయిట్ అండ్ సీ.. దున్నపోతుకు గడ్డి వేసి.. ఆవుకు పాలు ఇవ్వమంటే ఎలా ఇస్తుంది.. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ కేసీఆర్ కి తెలంగాణ ప్రజలపై లేదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో గన్ పార్క్ దగ్గర కేసీఆర్ తో బహిరంగ చర్చకు సిద్దం అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
Read Also: Mahesh Babu: ఎన్ని.. ఎన్ని.. ఎన్ని హిట్ సినిమాలు వదులుకుంటావ్ అన్నా.. ?
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
ఇక, అక్టోబర్ 1న ప్రధాని మోడీ 13,545 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జక్లేర్ టు కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రజలకు అంకితం చేయనున్నారు. దీని ద్వారా గోవా నుంచి హైదరాబాద్ 120 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.. కాచిగూడ-రాయచూర్ డెమో సర్వీస్ ప్రారంభం కానుంది.. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: CBFC Corruption: విశాల్ ఆరోపణలకు దిగొచ్చిన కేంద్రం.. విచారణకు ఆదేశం!
రూ. 2,661 కోట్ల వ్యయంతో నిర్మించిన హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ పైప్ లైన్ ను ప్రజలకు మోడీ అంకితం చేస్తారు అని కిషన్ రెడ్డి అన్నారు. 13 లక్షలమంది ఎల్పీజీ కనెక్షన్లు పొందే కెపాసిటీ.. తెలంగాణలో 230 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఉంటే 130కి.మీ మేర పాలమూరు జిల్లాలోనే ఉంది.. ,932 కోట్లతో తెలంగాణ-నెల్లూరు కృష్ణపట్నం మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ నిర్మాణం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ల్ ఆఫ్ ఎకనమిక్స్, ల్ ఆఫ్ మాథమెటిక్స్, స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ భవనాలను మహబూబ్ నగర్ నుంచి వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
Read Also: Google Layoff: “నా గుండె పగిలిపోయింది”.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే గూగుల్ ఉద్యోగి లేఆఫ్..
ఇక, మరో వైపు వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 8,021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంఖుస్థాపనలు చేయనున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ మొదటి దశలో 800మెగావాట్ల ప్రాజెక్టును అంకితం చేస్తారు.. 680 మెగావాట్లు తెలంగాణ అవసరాలకే ఉపయోగించడం జరుగుతుంది.. రెండోదశ 800మెగావాట్ల ప్లాంటే వచ్చే డిసెంబర్ కల్లా అందుబాటులోకి రానుంది అని ఆయన చెప్పారు. ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో ప్రాజెక్ట్… తక్కువ ఖర్చుతో ప్రొడక్షన్.. దేశంలోని అన్ని ఎన్టీపీసీల్లోకెల్లా అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది.. బొగ్గు వినియోగం తక్కువ… CO2 తక్కువ విడుదల దీని యొక్క ప్రత్యేకత అని పేర్కొన్నారు. 100 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ వాటర్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ కూడా ప్రత్యేకంగా తెలంగాణలో నిర్మించామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!