NTV Telugu Site icon

Kishan Reddy: త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుంది..

Kishan Reddy

Kishan Reddy

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్‌లోనే ఉందని అన్నారు. ఇంటిని నడిపే మాతృమూర్తి మహిళ అని పొగిడారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పని చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహిళలు బాగా పని చేశారు.. దేశ సరిహద్దుల్లో రక్షణ విభాగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లు ఇండియాలో ఉన్నారు.. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం మోదీది అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రసూతి సెలవులు 26 వారాలకు పొడిగించిన ఘనత మోదీ సర్కార్‌ది అన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు బిల్లునే ఆమోదించారని పేర్కొన్నారు.

Read Also: Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో కన్నీరు.. కారణం ఏంటంటే..

మరోవైపు.. 2014-2019 తొలి తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా పాలన సాగిందని ఆరోపించారు. ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి మండుటెండల్లో మహిళలు పాల్గొన్నారు.. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లానే పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫ్రీ బస్ ఇచ్చిన రేవంత్.. అందులో తిరుగుతూ మిగిలిన హామీలు అమలు చేసినట్లు ఫీల్ అవ్వమని మహిళలకు చెబుతున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతం మహిళా టీచర్లు, గ్రాడ్యుయేట్లు బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. మహిళలు పిడికిలి బిగించి రేవంత్ సర్కారును నిలదీయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..

నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. త్వరలోనే మోదీ నేతృత్వంలో జన గణన జరగబోతుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరగబోతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు అవుతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని వెల్లడించారు. కావాలనే ఇక్కడున్న రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క సీటును కూడా తగ్గించే ఆలోచన తమకు లేదని చెప్పారు. కొంతమంది దక్షిణ భారతంలో ఆల్ పార్టీ మీటింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు.. జనాభా లెక్కల సేకరణ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి కూడా వదిలిపెట్టవద్దు.. కుటుంబ రాజకీయాలు వద్దు.. ఇది మంచి సంప్రదాయం కాదని కిషన్ రెడ్డి సూచించారు.