NTV Telugu Site icon

Kishan Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ కట్టుబడి ఉంది..

Kishanreddy

Kishanreddy

సామాజిక పోరాటంలో ఒక ప్రధాని మోడీ పాల్గొనడం చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచి పోతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ మాదిగల సమస్యను అర్థం చేసుకుని కమిట్ మెంట్ తో మాట్లాడారు.. వాళ్ళ పోరాటం ఎవరికో వ్యతిరేకం కాదు.. ఈ సమస్య పరిష్కారం కోసం ఏ ప్రధాని చొరవ చూపలేదు అని ఆయన పేర్కొన్నారు. ఎవరు కూడా చిత్తశుద్దితో పని చేయలేదు.. ఇందులో మొదటి దోషి కాంగ్రెస్ పార్టీనే.. ఉష మెహ్రా కమిటీ రిపోర్ట్ ను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది.. ఆ నివేదికను చదువే ప్రయత్నం మన్మోహన్ సింగ్ చేయలేదు.. గత ఏడాది హైదరబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలోనే అమిత్ షా, జేపీ నడ్డాలతో ఎస్సీ వర్గీకరణపై చర్చించాము అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Mangalavaaram : అప్పడప్పడ తాండ్ర సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

ఈ ఏడాది జూలై 8 న మంద కృష్ణా మాదిగ మోడీ తో కలిసి వివరించారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ ఆదేశం తో అక్టోబర్ 2 న అమిత్ షా .. మంద కృష్ణ , మాదిగ సామాజిక వర్గం తో భేటీ అయ్యారు.. వెంటనే భారత ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టులో వెంటనే టెక్ ఆప్ చేయాలని కోరారు అని ఆయన తెలిపారు. సుప్రీం కోర్ట్ రెండు తీర్పులు ఇచ్చింది.. ఒక తీర్పు అనుకూలంగా, మరొకటి వ్యతిరేకంగా వచ్చాయి.. తీర్పు అనుకూలంగా ఇచ్చిన ధర్మాసనం.. రాజ్యాంగ ధర్మాసనం వేయాలని సూచించింది.. అక్టోబర్ 10న రాజ్యాంగ ధర్మాసనంను కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 7 గురు జడ్జిలతో ధర్మాసనం వేసిందని కిషన్ రెడ్డి చెప్పారు.

Read Also: Manipur Violence: 9 మైతీ తీవ్రవాద గ్రూపులపై ఐదేళ్లపాటు నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం

రాజ్యాంగ ధర్మాసనానికి లిఖిత పూర్వకంగా తమ వర్షన్ లను పంపించాలని.. కోర్ట్ లో కేసు వేసిన అందరికీ నోటీస్ లు పంపించింది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ కట్టుబడి ఉంది… వర్గీకరణ ను బీజేపీ భుజాన వేసుకుంది.. పరిష్కారం అయ్యే విధంగా కేంద్రం కృషి చేస్తుందన్నారు. కేంద్రం వేసే కమిటీ వర్గీకరణ చేయాలా వద్దా అని కాదు.. వేగవంతంగా అమలు చేయడం కోసమే.. కమిటీ ఒక టాస్క్ ఫోర్క్.. కొన్ని పార్టీ లు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయి.. న్యాయ స్థానం తీర్పు అనుకూలంగా రాక పోతే చట్ట సవరణ చేస్తాం.. కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారు.. కేంద్రంలో ఉన్నది మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు.. మోడీ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం

మేము తెలంగాణలో అధికారంలో లేము అయిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సమస్య పరిష్కారం కోసం అన్ని దారుల గుండా ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి చెప్పారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అంటే కేసీఆర్ తీసుకెళ్ల లేదు.. బీఆర్ఎస్ ఎంపీలు ఏ రోజు ప్రధానినీ కలిసి డిమాండ్ చేయలేదు.. కేసీఆర్ ఈ అంశంపై కలవలేదు అని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీ లు కింద భూమి కదులుతుందని భయ పడుతున్నాయి.. ప్రధాని శాశ్వత పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నాడు.. ఇది ఓట్ల కోసమో, రాజకీయాల కోసం కాదు.. ఓట్లు కోసం అయితే మహిళ చట్టంను ఇపుడే అమలు చేసే వాళ్ళం అని కిషన్ రెడ్డి వెల్లడించారు.