NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్‌ రెడ్డి సూచనలు చేశారు.

Read Also: Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌ రావు కౌంటర్‌

తెలంగాణలో బీజేపీకు మంచి వాతావరణం ఉందని.. ఈ అనుకూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవాలని కిషన్‌ రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు. ప్రధాని మోడీ ఆదిలాబాద్, సంగారెడ్డి సభలను ప్రజలు విజయవంతం చేశారన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ సంకల్ప యాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ జెండా మీదనే యాత్ర నిర్వహించామన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు. బీజేపీను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 17కు 17స్థానాల్లో విజయం సాధించాలంటే ఎన్నికల నిర్వహణ ఉండాలని కిషన్‌ రెడ్డి వివరించారు.