Site icon NTV Telugu

Kishan Reddy : మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా

Kishan

Kishan

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని, రాష్ట్రం లో రేవంత్ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే కరెంట్ కోతలతో పాటు కరువు వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు, నాయకుల్లో నిరాశ నిస్పృహ మొదలైందన్నారు.

 

 

బీఆరెస్ దొంగ‌లు పోయి కాంగ్రెస్ గ‌జ‌దొంగ‌లు వ‌చ్చిన‌ట్లుంద‌న్నారు. అసెంబ్లీలో బీఆరెస్ అవినీతి గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విచార‌ణ ఎందుకు చేయించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణను అప్పుడు కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ టీమ్ దోచుకుంటోందని ఆరోపించారు. దేశం లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కరువు కానీ కరెంట్ కోతలు గానీ లేవని అన్నారు కిషన్‌ రెడ్డి. అంతేకాకుండా.. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో దేశం లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణని భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.

 

Exit mobile version