Site icon NTV Telugu

Kishan Reddy : గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

Kishan Reddy

Kishan Reddy

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమానికి మోడీ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యిందన్నారు కిషన్‌ రెడ్డి. గత సంవత్సరం లక్ష పదిహేడు కోట్లకు పైగా గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్య్రమo చేపడుతున్నామన్నారు కిషన్‌ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎండ్లు గడుస్తున్న ఆదివాసీల బ్రతుకులు మారలేదన్నారు కిషన్‌ రెడ్డి. 75 తెగల ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, రేపటి నుంచి ప్రధాని ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి పదకొండు అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 18 రాష్ట్రాలలో 75 తెగల ఆదివాసీలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, 82 వేల గూడెలు, 32 లక్షల ఆదివాసీలు దేశంలో ఉన్నారన్నారు కిషన్‌ రెడ్డి.

 

ఆదివాసిల అభివృద్ధిపై మోడీ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని, 75 సంవత్సరాలుగా చేయలేని పని 45 రోజులలో మోడీ చేసి చూపించారన్నారు. అర్హులైన ఆదివాసీలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని, వంద ఆదివాసిల హాస్టల్స్ నిర్మించబోతున్నామన్నారు కిషన్‌ రెడ్డి. ఆదివాసీల హాస్పిటల్స్ కట్టబోతున్నామని, ఆదివాసీల 17 గ్రామాల్లో రేపు కరెంట్ వెలగబోతోందన్నారు కిషన్‌ రెడ్డి. 72 వేల ఆధార్ కార్డులు, 83 వేల ఆయూస్మాన్ భవ హెల్త్ కార్డులు అందిస్తున్నామని, రేపు ఆదివాసీలకు 49 వెలకు పైగా క్యాస్ట్ సరిఫికెట్స్, 32 వెళ్ళు పైగా రేషన్ కార్డులు అందించబోతున్నామన్నారు. ఆదివాసీలు సంపూర్ణమైన సాధికారిత సాధించే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఆదివాసీలు కనీసం మౌలిక వసతులు లేవన్నారు.

3 లక్షల ఆదివాసీల విద్యార్థులకు ఏక లవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు ఉంటుందని, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు కేటాయించందని ఆయన వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు అయితే గిరిజన విద్యార్థుల బతుకులు మారుతాయని, యూనివర్సిటీ నిర్మానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలిక యునివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, తెలంగాణలో ఆదివాసీలు ఎక్కువగా వెనక బడిన ప్రాంతాలు, బూపాలపల్లి, హసిఫాబాధ్, భద్రాచలం ప్రాoతాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. ట్రైబల్ టూరిజం అభివృద్ధి చేయడంపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రేపు వర్చువల్ గా 18 రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని మాట్లాడుతారన్నారు.

Exit mobile version