Site icon NTV Telugu

Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : రోజ్‌గారి మేళాలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజ్ గార్ మేళాలు పూర్తి అయ్యాయి… ఇది 11 వ మేళా అని ఆయన అన్నారు. ఈ రోజుతో (ఈ 11 మేళాలో) కలుపుకొని సుమారుగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కిషన్‌ రెడ్డి. ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, ఖాళీలు ఉండొద్దు అని ప్రధాని ఆదేశాలు ఇచ్చారన్నారు. అందుకే రెగ్యులర్ గా నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగేది… ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని, నా మంత్రిత్వ శాఖలో మొత్తం రెగ్యులర్ కాంట్రాక్టు ఇతర కలిపి 8 లక్షల ఉద్యోగులు ఉంటారు… ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు కిషన్‌ రెడ్డి.

Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?

కరోనాతో ఎన్నో దేశాల ఆర్థికంగా అతలాకుతలం అయ్యాయని, మన దేశంలో తయారు అవుతున్న మొబైల్ ఫోన్‌లను అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మన దేశంలో 5జి సేవలు అందుతున్నాయి… చాలా దేశాల్లో 5జి లేదని ఆయన అన్నారు. అతి తక్కువ ఛార్జ్ తో నెట్ సేవలు అందిస్తున్న దేశం మన దేశం అని, దేశం లో UPI/డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయన్నారు. డిఫెన్స్ పరికరాలు ఎగుమతి చేస్తున్నామన్నారు. మన దేశ యువత అతి తొందరలోనే ప్రపంచాన్ని శాసిస్తుందన్నారు కిషన్‌ రెడ్డి. మన తల్లి దండ్రులను, మన గ్రామాన్ని, మన మాతృ దేశాన్ని, మన గురువులను ఎప్పటికీ మరవకూడదన్నారు.

Tollywood : టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్లపై టాలీవుడ్ చిన్నచూపు

Exit mobile version